Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. శుక్రవారం రాశిఫలాలు

|

Feb 04, 2022 | 7:08 AM

Today Horoscope: కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. శుక్రవారం రాశిఫలాలు
Follow us on

Today Horoscope: కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. కావున శుక్రవారం (ఫిబ్రవరి 4న ) రాశి ఫలాలు (Horoscope )ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారి పనులు సకాలంలో పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు వరిస్తాయి. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం: ఈ రోజు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ కూడా అధికం అవుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధు, మిత్రులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.

మిథునం: ఈ రాశివారికి శుభకాలం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులతో కలిసి విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: ఈ రాశి వారికి బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు కొంచెం ఆలస్యమైనా సకాలంలో పూర్తవుతాయి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

సింహం: ఈ రోజు సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబపెద్దల సహకారంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కన్య: ఈ రోజు అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు కలిసివస్తాయి. సమయానుకూలంగా పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల: ఈ రోజు ఈ రాశివారు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం: ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా స్పందించడం మంచిది. కుటుంబసభ్యులు, సన్నిహితులకు గొడవలకు దూరంగా ఉండాలి.

ధనుస్సు: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించేందుకు ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో ముందుజాగ్రత్త అవసరం. కొన్ని పరిస్థితులు మనోవేదనకు గురిచేస్తాయి.

మకరం: ఈ రాశివారు మనోబలం తగ్గకుండా ధైర్యంతో ముందడుగు వేస్తే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురిచేస్తాయి.

కుంభం: ఈ రాశి వారికి శుభకాలం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు సఫలం అవుతాయి. కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీనం: ఈ రాశివారు చిత్తశుద్దితో సకాలంలో పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

Also Read: Hero Electric: మీకు హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కావాలా..? ఈ బ్యాంకు రుణంపై సులభంగా పొందవచ్చు..!

Joe Biden: ఐఎస్ చీఫ్ అల్‌ ఖురేషీ హతం.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌