Horoscope Today: ఈ రాశి వారికి ఓ శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.. ఆర్థిక లాభాలు..!

| Edited By: Subhash Goud

Apr 04, 2022 | 5:45 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు...

Horoscope Today: ఈ రాశి వారికి ఓ శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.. ఆర్థిక లాభాలు..!
Horoscope Today
Follow us on

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. ఏప్రిల్‌ 4 (సోమవారం)న ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం.

  1. మేష రాశి: చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి.
  2. వృషభ రాశి: ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
  3. మిథున రాశి: ఆలోచనతో ముందుకు సాగితే అనుకున్న పనులు మీ సొంతం అవుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  4. కర్కాటక రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్నవి నెరవేరుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.
  5. సింహ రాశి: ఏదైనా వ్యాపారాలు, స్థిరాస్తి కొనుగోళ్లు జరిపే ముందు ఆలోచించి చిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఒక విషయం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది.
  6. కన్య రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధువులతో వ్యవహరించడం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవడం మంచిది.
  7. తుల రాశి: ఏ పని చేపట్టినా అది పూర్తయ్యే వరకు పట్టుదలతో ముందుకు సాగండి. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది. ఎవరిని పడితే వారిని నమ్మకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త.
  8. వృశ్చిక రాశి: మీ పనితీరుపై ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
  9. ధనుస్సు రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన పని త్వరగా పూర్తవుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  10. మకర రాశి: ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఎంత సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
  11. కుంభ రాశి: చిన్నపాటి ప్రయత్నాలతోనే మంచి ఫలితాలు పొందుతారు. సంతోషం పెట్టే శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.
  12. మీన రాశి: కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఏ పని చేపట్టినా ఇంటి సభ్యులతో చర్చించడం మంచిది. వ్యాపారాలలో రాణిస్తారు. మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. ఒక చోట తగ్గితే.. మరో చోట పెరిగాయి..!

ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పోస్టాఫీసు టైం డిపాజటిట్‌.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?