Horoscope Today (31-08-2022): రోజులో తమకు ఎలా ఉంటుంది అంటూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 31 వ తేదీ ) బుధవారం వినాయక చవితి రోజున రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక లాభాలను అందుకుంటారు. వ్యాపార రంగంలోని వారు శుభఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనులకు ఆటంకాలు కలగకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మిశ్రమకాలం. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాలి. అధికారుల మీ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచూతూచి అడుగు వేయాలి. కలహాలకు దూరంగా ఉండడం మేలు.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఆనందాన్ని ఇచ్చే వార్తను వింటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చంచల స్వభావాన్ని వీడితే మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. స్వధర్మాన్ని కాపాడుతూ వివాదాలకు దూరంగా ఉండడం మేలు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక విషయాల్లో పెద్దలను కలిసి ముందుకు అడుగు వేస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కకోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగడం మేలు. ఆత్మీయుల సహాయంతో పని చేస్తారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)