Horoscope Today: వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఇలా..
దిన ఫలాలు (నవంబర్ 27, 2023): మేష రాశి వారికి రోజంతా చాలావరకు హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. వృషభ రాశి వారు తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (నవంబర్ 27, 2023): మేష రాశి వారికి రోజంతా చాలావరకు హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. వృషభ రాశి వారు తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా చాలావరకు హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సతీ మణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. ఉద్యోగాల్లో చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కొత్త బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపో తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అయితే, బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రోజంతా ప్రశాంతంగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరు గుతుంది. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాభాలు నిలకడగా ఉంటాయి కానీ, పోటీదార్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొం టారు. గృహ, వాహన సౌఖ్యాల మీద దృష్టి సారిస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పను లను ఆలస్యంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగిపో తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు చాలావరకు కలిసి వస్తాయి. మానసిక విశ్రాంతికి దూరం అవు తారు. కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కాస్తంత బాగానే ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో పనిభారాన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేయ డంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొం టారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూత నోత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ మీద అధికారులు బాగానే ఆధారపడడం జరుగుతుంది. ఆర్థిక ప్రయ త్నాలు సఫలం అవుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం కూడా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రధానమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో చక్కబడతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. సతీమణితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి కానీ, ఖర్చుల విషయంలోనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుం బంలో ప్రశాంతత లోపిస్తుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణాలు చేయ వద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక వాతావరణం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువర్గం నుంచి పెళ్లికి సంబం ధించిన శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో కొందరు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు.