దినఫలాలు (అక్టోబర్ 25, 2023): మేష రాశి వారి ఆర్థిక ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశి వారు అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. మిథున రాశి వారి కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఆదాయం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను, పను లను సకాలంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడ తాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలను అమలు చేసి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండక పోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టువు లతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధువుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరో గ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రోజంగా సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలున్నా తేలికగా పరి ష్కారమైపోతాయి. వృత్తి జీవితంలో కాస్తంత డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు చవిచూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని మరింతగా తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అన్ని సమ స్యలూ సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం మంచిది కాదు. ముఖ్య మైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగు తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవ కాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు పని భారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి సమయం అను కూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వోద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు, అవివాహి తులకు సమయం ఆశించినంత అనుకూలంగా లేదు. ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ధనాదాయం ఆశాజనకంగా కొనసాగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు ప్రయో జనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోతారు. ఒక రిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెడతారు. పిల్లలు శుభవార్త తీసుకు వస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి లోటు ఉండదు కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో ప్రమో షన్ రావడానికి వీలుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవి తంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కొద్ది పాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధువులు విమర్శలు చేసే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఒకటి రెండు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని తేలికగా పరిష్కరించుకుం టారు. బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా ప్రశాంతంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. ఇష్టమైన బంధువులను, సన్నిహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి సంతోష కరమైన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువర్గం నుంచి శుభ వార్త అందుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.