Ketu Transit 2023: కన్యారాశిలోకి మారుతున్న కేతువు.. వారికి ఆకస్మిక ధన లాభం పక్కా.. !
Ketu Gochar 2023: తులా రాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్న కేతువు ఈ రాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. రాహువు మాదిరిగానే కేతువు కూడా వక్ర గ్రహం, పాప గ్రహం. రాహువు లాగానే కేతువు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు కానీ, కేతువు ఆధ్యాత్మిక చింతనకు కారకుడు కనుక కాస్తంత నయమనిపిస్తాడు. ఈ నెల 31 నుంచి కన్యారాశిలో తన సంచారం ప్రారంభించే కేతువు 2025 మే 18 వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు.
ఈ నెలాఖరు నుంచి రాహువుతో పాటు కేతువు కూడా రాశి మారడం జరుగుతోంది. ఒకదానికొకటి సమ సప్తకంలో ఉండే ఈ జంట గ్రహాలు అక్టోబర్ 31నుంచి మీన, కన్యా రాశుల్లోకి మారడం జరుగుతోంది. తులా రాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్న కేతువు ఈ రాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. రాహువు మాదిరిగానే కేతువు కూడా వక్ర గ్రహం, పాప గ్రహం. రాహువు లాగానే కేతువు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు కానీ, కేతువు ఆధ్యాత్మిక చింతనకు కారకుడు కనుక కాస్తంత నయమనిపిస్తాడు. ఈ నెల 31 నుంచి కన్యారాశిలో తన సంచారం ప్రారంభించే కేతువు 2025 మే 18 వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు. అందువల్ల దీర్ఘకాలిక ప్రభావం ఉండే ఫలితాలనివ్వడం జరుగుతుంది. కేతువు రాశి మార్పు ఏయే రాశులవారి జీవితాలను ఏ విధంగా మార్చబోయేదీ పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశికి ఆరవ స్థానంలో కేతువు సంచరించడం శుభ ఫలితాలనే ఇస్తుంది. శత్రు, రోగ, రుణ సమ స్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఏ రంగానికి చెందినవారికైనా పోటీదార్లు, రహస్య శత్రువుల సంఖ్య బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తాతల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తల్లి వైపు వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల చుట్టూ, స్వామీజీల చుట్టూ తిరగడం ఎక్కువవు తుంది. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు పెరిగి మంచి గుర్తింపు లభిస్తుంది. కోరుకున్నవారితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇతరులను గురించిన చెడు ఆలోచనలు, పగ, ద్వేషాలు, చేదు అనుభవాలు వగైరాల నుంచి బయటపడడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మిథునం: కేతువు నాలుగవ స్థానంలో అంటే, సుఖ స్థానంలో సంచరించడం ఏమంత మంచిది కాదు. వ్యక్తి గతమైన సుఖ సంతోషాలు, మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది. అతి జాగ్తత్తగా, అప్రమత్తంగా ఉండని పక్షంలో గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారికి ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు మంచి యోగం ఇస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురో గతి ఉంటుంది. సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కనపెట్టి ఈ రాశివారికి ప్రమోషన్ ఇచ్చే అవ కాశం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు.
- సింహం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చినా, తీసుకున్నా అది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరగకపోవచ్చు. ఆఫీసు నుంచి రావాల్సిన బకాయీలు ఒకపట్టాన రాకపోవచ్చు. ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులుంటాయి. ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం గానీ చేయవద్దు. కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశిలో కేతువు ప్రవేశించడం వల్ల వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. ప్రేమలో పడే సూచనలు న్నాయి. పెళ్లి సంబంధాలు మొదటి ప్రయత్నంతోనే సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించడం, తీర్థయాత్రలు చేయడం వంటివి జరుగుతాయి. సాధారణంగా భర్త అయితే వ్యసనాలకు అలవాటు పడడం, భార్య అయితే దుబారా చేయడం, విలాసాలకు ఖర్చు పెట్టడం వంటివి జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్తత్త అవసరం.
- తుల: ఈ రాశివారికి వ్యయ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల జీవితం చాలావరకు హుందాగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఖర్చు పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఇతరులకు ఇతోధి కంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గిపోయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఏడాదిన్నర పాటు ఆదాయం వృద్ధి చెందుతూ ఉండడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక సమస్యలతో పాటు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. సోదరులతో, తల్లితండ్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. సంతానం లేనివారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో, అంటే జీవనోపాధికి సంబంధించిన స్థానంలో కేతువు ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో భారీగా మార్పులు జరగడం, బాధ్యతలు పెరగడం, ఉద్యోగం మారడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ కావడం కూడా జరగవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత, ఆస్తి వ్యవహారాల్లో అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. తండ్రి సహాయం ఎక్కువ అవుతుంది.
- మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఏదో ఒక రూపంలో తప్పకుండా అదృష్టం పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అయితే, తండ్రి ఆరోగ్యం ఆందోళన కలి గించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.
- కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల ఆర్థిక, కుటుంబ సమస్యలు తలెత్తే అవ కాశం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం, ఇవ్వడం లాంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. సతీ మణితో సంప్రదించకుండా ఏ పనీ చేయకపోవడం శ్రేయస్కరం. సతీమణికి అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
- మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కేతువు ప్రవేశం కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులకు దారి తీస్తుంది. భార్య (లేదా భర్త)తో అపార్థాలు తలెత్తడం, అనుమానాలు ఏర్పడడం, ఇందులో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. భార్యలో ‘గయ్యాళితనం’ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి కానీ, వ్యాపారాల్లో భాగస్వా ముల వల్ల ఇబ్బందులు ఎదురు కావచ్చు. మొండి వ్యాధుల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యమైన పరిహారాలు: కేతువు సాధారణంగా 1,2,4,7,8 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో అక్షరాలా ‘ఏడిపించే’ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2,4,8 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు ఆ రాశుల వారికి రాత్రిళ్లు నిద్ర కూడా పట్టనివ్వడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కేతువు దుస్థానాల్లో సంచరిస్తున్నప్పుడు దుర్గాదేవి స్తోత్రాన్ని గానీ, లలితా సహస్ర నామాన్ని గానీ పఠించడం మంచిది. కేతువుకు సంబంధించిన అశ్విని, మఖ, మూల నక్షత్రాల వారు కూడా వీటిని పఠించడం వల్ల కేతువు దుష్ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది.