Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 25, 2024 | 5:01 AM

Today Horoscope (December 25, 2024): మేష రాశి వారికి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశికి చెందిన వారికి ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి.. మిథున రాశికి చెందిన వారు కుటుంబ విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 25th December 2024
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఫలితముంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా పురోగమిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఫలితముంటుంది. మిత్రులతో కలిసి విందు కార్యక్ర మంలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. ఆస్తి వివాదం నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ బాధ్యతల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కీలక మార్పులు చేపట్టే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆదా యానికి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు రాకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యో గం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నష్ట దాయక కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం, శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా మారతాయి. ఆదా యం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొన్ని ప్రత్యేక బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతా వ రణం ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ధనపరంగా ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకుంటారు. సహోద్యోగుల నుంచి ఆశిం చిన సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యో గంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం పెరుగుతుంది కానీ, దుర్వినియోగం చేయకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులను ప్రణాళికాబద్ధంగా చక్కబెడతారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొన్ని అత్య వసర పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల అధి కారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు.ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఇంటా బయటా మాటకు, చేతకు విలువ ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల నష్టపోతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఎదురు చూస్తున్న కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యు లతో కలిసి పుణ్య కార్యంలో పాల్గొంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యో గం మారడానికి ప్రస్తుతానికి ప్రయత్నించకపోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.