AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు: ఈ రాశివారు అప్పులు చేస్తారు.. అనాలోచిత నిర్ణయాలు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్త

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ ఎక్కువ మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: రాశి ఫలాలు: ఈ రాశివారు అప్పులు చేస్తారు.. అనాలోచిత నిర్ణయాలు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్త
Subhash Goud
|

Updated on: Jun 25, 2021 | 6:32 AM

Share

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ ఎక్కువ మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 25న) శుక్రవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు విషయాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. ఏ పనులైనా చేపట్టే ముందు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వేంకటేశ్వరస్వామి పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి

వ్యక్తిగత అవసరా కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు నిర్వహించి విధుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పని చేసే సంస్థల నుంచి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మిథున రాశి

స్నేహితులు, బంధువుల నుంచి వేర్వేరు విధంగా ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక చింతనలో ఉండటం కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి

ఆర్థికపరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు వహించాలి. గణపతి పూజ చేయడం మేలు జరుగుతుంది.

సింహరాశి

ఈ రాశివారు వ్యాపార,అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల కొనుగోలు, ఇతర విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.

కన్యరాశి

ఈ రాశివారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వద్ద బాకీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

తుల రాశి

వివిధ కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు పాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇతరులకు హామీలు ఇవ్వడంలో జాగ్రత్తగా వహించాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అష్టలక్ష్మీ అమ్మవారి పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

తీసుకున్న నిర్ణయాల కారణంగా సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. హనుమాన్‌ చాలిసా పారాయణం మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి

చేపట్టిన పనులలో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఒత్తిడికి గురవుతంటారు. ఉద్యోగ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి లేనిపోని మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విష్ణు పూజ చేయడం మేలు చేస్తుంటుంది.

మకర రాశి

ఈ రాశివారు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రాజరాజేశ్వరి అమ్మవారి పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

కుంభరాశి

అనుకోని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. స్నేహితులు, కుటుంబంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దుర్గ అమ్మవారిని పూజించడం మేలు జరుగుతుంది.

మీన రాశి

ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగులు తమతమ విధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు పరిష్కారం అవుతాయి. భూ వివాద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి అడుగులు వేయడం మంచిది. దుర్గదేవి పూజ మేలు చేస్తుంది.

Follow Us