Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు అందుకుంటారు.. శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

| Edited By: Shaik Madar Saheb

Feb 24, 2024 | 6:38 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 24, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి భాగ్య స్థానంలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారికి.. రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు అందుకుంటారు.. శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 24, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి భాగ్య స్థానంలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారికి.. రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శుక్ర, శనుల అనుకూల సంచారం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు మిత్రులు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

భాగ్య స్థానంలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల విషయంలో శుభ వార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, కుజ గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రోటీనుగా సాగిపో తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సప్తమంలో శని సంచారం కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధానమైన కార్యకలాపాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రస్తుతం అయిదవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకుం టాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరు గుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సప్తమ స్థానంలో గురు సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు అందుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసివస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛలో ఉన్న కారణంగా ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి, లాభాలు పెంచుకుంటారు. ఆర్థికంగా ఆశించిన మేరకు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లావాదేవీలు, కార్యకలాపాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

దాదాపు గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం కూడా తగ్గి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఏ సమస్య అయినా చాలావరకు పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇష్టమైనవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

లాభస్థానంలో కుజ, శుక్రులు, ధన స్థానంలో గురువు ఉన్న కారణంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యా ర్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు లేదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..