AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubha Yoga: పౌర్ణమి తర్వాత మూడు కీలక గ్రహాలకు బలం.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు పక్కా.. !

ఈ నెల 24వ తేదీ నుంచి, పౌర్ణమి తర్వాత నుంచి చంద్ర సంచారం కారణంగా బుధ, శుక్ర, గురు గ్రహాల బలం పెరుగుతున్నందువల్ల శుభ యోగాలు, శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాలతో పాటు శని, కుజులు కూడా బాగా బలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అనేక శుభ యోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

Shubha Yoga: పౌర్ణమి తర్వాత మూడు కీలక గ్రహాలకు బలం.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు పక్కా.. !
Astrology Shubha Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2024 | 4:15 PM

Share

ఈ నెల 24వ తేదీ(శనివారం) నుంచి, పౌర్ణమి తర్వాత నుంచి చంద్ర సంచారం కారణంగా బుధ, శుక్ర, గురు గ్రహాల బలం పెరుగుతున్నందువల్ల శుభ యోగాలు, శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాలతో పాటు శని, కుజులు కూడా బాగా బలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అనేక శుభ యోగాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అవిః మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీనం. వీరికి ధన యోగాలు, అధికార యోగాలు తప్పకుండా సంభవించే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా చాలా సంవత్సరాల పాటు స్థిరత్వం కలగడానికి ఈ యోగాలు పునాది వేస్తాయి. ప్రస్తుతం గ్రహాల అనుకూల సంచారం ఏప్రిల్ చివరి వరకూ కొనసాగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి రాహు కేతువులతో సహా ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉండడమనేది అది అరు దుగానే జరుగుతుంది. విపరీత రాజయోగం, మహాభాగ్య యోగం ఈ రాశివారికి ఒకేసారి పట్టడం జరిగింది. ఫలితంగా సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు.
  2. వృషభం: ఈ రాశికి నవమ, దశమ స్థానాలు శుభ గ్రహాలతో పటిష్ఠంగా ఉండడంతో పాటు లాభస్థానంలో ఉన్న రాహువు వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడి కూడా ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. విదేశీయానానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. సతీమణికి కూడా మహాభాగ్య యోగం పడుతుంది.
  3. తుల: ఈ రాశివారికి అనుకోని అదృష్టం కలసి రాబోతోంది. పదోన్నతులు లభించడంతో పాటు జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడం వల్ల కూడా బాగా లబ్ధి పొందడం జరుగు తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావచ్చు. సంపన్నవ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి విపరీత రాజయోగం పడుతుంది. లక్ష్మీయోగం కూడా పట్టే అవకాశం ఉంది. రెండు నెలల కాలంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారిపోతుంది. విశేషమైన ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ప్రముఖులతో లాభదాయక పరిచయాల వల్ల కూడా ధన వృద్ధి సూచనలున్నాయి. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఆస్తులు సమకూరే సూచనలు కూడా ఉన్నాయి.
  5. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో గ్రహ బలం ఎక్కువగా ఉన్నందువల్ల తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. మకర రాశిలో ఉచ్ఛ కుజుడితో శుభ గ్రహం శుక్రుడు సంచరిస్తూ ఉండడం, ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. నిరుద్యోగు లకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి ధన, లాభ స్థానాలు శుభ గ్రహాలతో నిండి ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారమవుతుంద న్నట్టుగా ఉంటుంది. లాభధాయక పరిచయాలు పెరుగుతాయి. ఊహించని విధంగా ఐశ్వర్య యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. సామాజికంగా కూడా పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. విలాస జీవితం అలవడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో