AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

Horoscope Today: అన్ని రోజులు మనవి కావు. కొన్ని సందర్భాల్లో మంచి చేద్దామని అనుకున్నా మనకి కలిసి రాదు. కాబట్టి మనం చేసే పనులైనా...

Horoscope Today: ఈ రాశివారు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
Ravi Kiran
| Edited By: Team Veegam|

Updated on: Mar 23, 2021 | 1:31 PM

Share

Horoscope Today: అన్ని రోజులు మనవి కావు. కొన్ని సందర్భాల్లో మంచి చేద్దామని అనుకున్నా మనకి కలిసి రాదు. కాబట్టి మనం చేసే పనులైనా, తీసుకునే నిర్ణయాలైనా ఆచితూచి తీసుకోవడం మంచిదని పెద్దలు అంటుంటారు. ఈ క్రమంలో రాశి ఫలం ఆధారంగా మనం చేపట్టబోయే పనుల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగ్గ పరిహారాలు పాటిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి చూసేయండి.

మేష రాశి:

ఆస్తి వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకుంటారు. ‘శ్రీరాజమాతంగి నమః’ అనే నామస్మరణను పటించండి.

వృషభ రాశి:

దైవారాధనలో పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పేదవారికి అన్నదానం చేయడం మంచిది.

మిధున రాశి:

కష్టమైన పనులు చేపట్టి ఇష్టంగా పూర్తి చేస్తారు. వింత వింత కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం మంచిది.

కర్కాటక రాశి:

అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. వ్యక్తిగత సమయం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరీశంకరుని పూజ, దర్శనం మేలు చేస్తుంది.

సింహ రాశి:

సంఘంలో గౌరవాలు పెంచుకుంటుంటారు. నూతన పనులు చేపడతారు. సూర్యగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

కన్య రాశి:

బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో నిధానంగా వ్యవహరించండి. శ్రీసుక్త పారాయణ మేలును కలగజేస్తుంది.

తులా రాశి:

సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. అభిమానులను కోల్పోకుండా జాగ్రత్తగా ఉంటుండాలి. గౌరవ మర్యాదలు పొందుతారు. ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:

శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు.దుర్గాసప్తశ్లోకీ పారాయణ మేలు చేస్తుంది.

మకర రాశి:

స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతీ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభ రాశి:

కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. వ్యక్తిగత విమర్శలు ఎదుర్కుంటారు. మిశ్రమమైన ఫలితాలను పొందుతారు. సంకట నాసనా గణపతి స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

మీన రాశి:

పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. మహాలక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..