దిన ఫలాలు (ఏప్రిల్ 22, 2024): మేష రాశి వారికి ఈ రోజు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి విభే దాలు, అపార్థాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొన్ని ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల్లో ఒకరిద్దరికి ఇతోధికంగా సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందు తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండు పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొద్దిపాటి విభే దాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల రాకపో కలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆశించిన శుభవార్త వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. గృహ, వాహన సౌకర్యాల గురించి ఆలోచిస్తారు. ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరో గ్యం పరవాలేదు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. ఆదా యం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్విని యోగం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు.
కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ లేదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగు తుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గు తాయి. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభి స్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు విజయాలు సాధి స్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు, వ్యవహారాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో భారీ లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. ఇష్ట మైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపా రాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమ స్యలు కూడా తగ్గుతాయి. కుటుంబసమేతంగా ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.