Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 20, 2024): మేష రాశి వారికి పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 20th June 2024

Edited By:

Updated on: Jun 20, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 20, 2024): మేష రాశి వారికి పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. దానధర్మాలను తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమ స్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవ హారాలు సానుకూలంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తి వ్యవహారా లకు ప్రస్తుతానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించు కోవడం అవసరం. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పాత బాధ్యతల స్థానంలో కొత్త బాధ్యతలు చేరే అవకాశం ఉంది. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా సఫలం అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోగ మిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద తగ్గుతుంది. వీటిల్లో కీలక మార్పులు చేపట్టి లభ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఉంటుంది కానీ, సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు బాగానే సాగిపోతాయి. అధికారులతో సామరస్యంగా ఉండడం మంచిది. శుభ వార్తలు అందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఇతరులకు సహా యం చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల శ్రమ పెరు గుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం ఉంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగు తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఎటువంటి ప్రయత్నమైనా సానుకూలంగా నెరవేరుతుంది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమస్యలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. స్వల్పంగా అనారోగ్య బాధలుం టాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంతో దైవ కార్యాలయాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. జీవిత భాగస్వామితో శుభ కార్యాలకు హాజరవుతారు. ఆస్తి వ్యవహారం ఒకటి ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. నిరుద్యోగులు కొద్దిగా ఆశాభంగం చెందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఒకరిద్దరు బంధు వుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

నిరుద్యోగులే కాక, ఉద్యోగులు కూడా ఆఫర్లపరంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో అను కూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది కాదు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెండింగ్ పనులు కొద్ది శ్రమతో పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఊహించని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.