Horoscope Today (20-01-2022): చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 20 వ తేదీ ) గురువారం (thursday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్ధిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపర, ఉద్యోగ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ధన వ్యయం చేస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కాలానుగుణంగా పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. అధిక ఖర్చు చేస్తారు. కీలక పనులను చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆర్ధికంగా లాభపడతారు. రోజంతా సంతోషంగా గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వం తో ముందుకు సాగుతారు. అనుకోని సంఘటనలు బాధ కలిగిస్తాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయం చేస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈరోజు అధిక శ్రమ పడతారు. అవసరానికి తగిన సాయం పొందుతారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు తమ పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోవల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది.
మీన రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. వ=బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.
Also Read: