Horoscope Today: ఈ రాశుల వారికి అన్నింటా విజయమే.. నెలారంభంలో ఈ రాశులకు శుభసూచికలు..

|

Feb 01, 2022 | 7:22 AM

సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటారు.

Horoscope Today: ఈ రాశుల వారికి అన్నింటా విజయమే.. నెలారంభంలో ఈ రాశులకు శుభసూచికలు..
Horoscope
Follow us on

సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. అలాగే అతి ముఖ్యమైన పనులను చేపట్టే ముందు ఏ రోజు చేయడం.. తమ రాశి ఫలాన్ని బట్టి ఏ సమయానికి అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువగా రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. తమ జీవితంలో ఒక రోజులో ముందుగా ఏం జరగనుందో ఖచ్చితంగా తెలియకపోయిన.. రాశి ఫలాల ద్వారా ఓ అవగాహనకు వచ్చేస్తారు. మరీ ఫిబ్రవరి నెలారాంభం. ఈరోజు ఫిబ్రవరి 1న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి..
ఈరోజు వీరు అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంద్రుమిత్రులను కలుసుకోవడమే కాకుండా.. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

వృషభ రాశి..
ఈరోజు వీరికి కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. అలాగే రుణ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఇతరులను.. కొత్తవారిని కలిసే సమయంలో జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి..
ఈరోజు వీరు శుభకార్యక్రమాలు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనలాభయోగముంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి..
ఈరోజు వీరికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వివాదాలలో చిక్కుకుంటారు. జాగ్రత్తలు అవసరం. అచి తూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

సింహ రాశి..
ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

కన్య రాశి..
ఈరోజు వీరికి బంధు, మిత్రులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. శారీరక శ్రమతోపాటు.. మానసిక ఆందోళన తప్పదు.

తుల రాశి..
ఈరోజు వీరికి ఉద్యోగ రీత్యా స్థానచలన మార్పులుంటాయి. కొత్తవారిని కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి ఖర్చులు ఎక్కువవుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి అన్నింటా విజయం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా కలిసిమెలసి సంతోషంగా ఉంటారు.

మకర రాశి..
ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

కుంభ రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది.

మీన రాశి..
ఈరోజు వీరు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వలన లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి.

Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..