Horoscope Today: ఈ రోజు రాశి ఫలాలు.. ఎవరికి ఎలా ఉందంటే..
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు...
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేదానిపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఫిబ్రవరి 2 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరుల సలహాలు, సూచనలు పొందుతారు.
వృషభ రాశి:
చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది.
మిథున రాశి:
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
కర్కాటక రాశి:
ముఖ్యమైన విషయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసిక దృఢంగా ఉంటాయి.
సింహరాశి:
రాబడులు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
కన్య రాశి:
పట్టవిడకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.
తుల రాశి:
ఇతరుల మాటలు వినకపోవడం మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. అవసరానికి సాయం చేసేవారు వస్తారు. ఆరోగ్యంలో కొన్ని సమస్యలు తలెత్త అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మకర రాశి:
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.
కుంభ రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీన రాశి:
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన వాటిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సలహాలు, సూచనలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
ఇవి కూడా చదవండి: