Horoscope Today: ఆ రాశుల వారికి అనూకూల ఫలితాలు.. ఈరోజు రాశిఫలాలు..

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా

Horoscope Today: ఆ రాశుల వారికి అనూకూల ఫలితాలు.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2022 | 7:43 AM

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 18న ) రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం: ఈ రాశి వారు అనూకూల ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

వృశభం: ఈ రాశి వారికి శ్రమ అధికమవుతుంది. కొన్ని విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టే పనుల్లో, తీసుకునే నిర్ణయాల్లో కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు.

మిథునం: ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. ఉత్సాహంతో ముందుకు సాగితే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మనస్పర్థలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం: అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సంఘటనలు మరింత ఉత్సాహాన్ని కల్పిస్తాయి. కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.

సింహం: ఈ రాశివారు చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది.

కన్య: ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోవడం మంచిది. పనులు పూర్తయ్యేందుకు శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల: ఈ రాశివారు ఇబ్బందులను అధిగమించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

వృశ్చికం: ఈ రాశివారు శుభవార్త అందుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు: చేపట్టిన పనులపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.

మకరం: ఈ రాశివారు కొన్ని విషయాల్లో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఓ పనికి సంబంధించిన శుభవార్త ఆనందాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం: ఈ రోజు చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా చేయూత లభిస్తుంది. ఒక వ్యవహారంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం మంచిది కాదు.

మీనం: శుభావర్త వింటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం మంచిది కాదు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)

Also Read:

World Bank Report: దేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం.. వారి ఆదాయం మాత్రం ఏటా 10% పెరిగింది..

Andhra Pradesh: పాతికేళ్ల క్రితం పిల్లల్ని, భార్యను వదిలివెళ్లిన భర్త.. హఠాత్తు ప్రత్యక్షం అవడంతో ఆ కుటుంబం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే