AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పాతికేళ్ల క్రితం పిల్లల్ని, భార్యను వదిలివెళ్లిన భర్త.. హఠాత్తుగా ప్రత్యక్షం అవడంతో..

పాతికేళ్ల క్రితం ఇంటిని వదిలెళ్లిన యాజమాని తిరిగి వస్తే.. కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేవు. భర్త తిరిగొచ్చిన ఆనందలో భార్య.. తండ్రి వచ్చాడన్న సంతోషంతో పిల్లలు తబ్బిబ్బులయ్యారు.

Andhra Pradesh: పాతికేళ్ల క్రితం పిల్లల్ని, భార్యను వదిలివెళ్లిన భర్త.. హఠాత్తుగా ప్రత్యక్షం అవడంతో..
Man Returns
Balaraju Goud
|

Updated on: Apr 18, 2022 | 7:49 AM

Share

Andhra Pradesh News: పాతికేళ్ల క్రితం ఇంటిని వదిలెళ్లిన యాజమాని తిరిగి వస్తే.. కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేవు. భర్త తిరిగొచ్చిన ఆనందలో భార్య.. తండ్రి వచ్చాడన్న సంతోషంతో పిల్లలు తబ్బిబ్బులయ్యారు. ఆయన రాకతో సంబంరపడ్డ కుటుంబాన్ని చూసి పెద్దాయన కంటనీరు పెట్టాడు. ఎంత తప్పుచాసానో అంటూ బాధపడ్డారు. పాతికేళ్ల క్రితం పిల్లల్ని, భార్యను వదిలెళ్లిన.. ఇంటి యాజమాని ఎట్టకేలకు తిరిగొచ్చాడు. మళ్లీ ఊరిని, కుటుంబాన్ని వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చి కుటుంబీకుల ఆశల్లో సంబరం తీసుకొచ్చాడు.

ఎన్నో ఏళ్లుగా.. ఎన్నో ప్రాంతాల్లో వెతికిన కనబడని భర్త.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే భార్య ధృడసంకల్పం.. తండ్రి బ్రతికే ఉన్నాడనే పిల్లల ఆశ ఎట్టకేలకు నెరవేరింది. చివరకు వెంకట్రావ్ ఇంటికి తిరిగిరావడంతో ఆనందతో భార్య.. సంతోషంతో పిల్లలు తబ్బిబ్బులయ్యారు. తనపై కుటుంబీకులు పెట్టుకున్న ఆశలు, పెంచుకున్న ప్రేమను చూసి ఆ పెద్దాయిన పుట్టెడు దుఖంతో ఏడ్చేసాడు. ఈఘటన యన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది.

చెరువు బజారుకు చెందిన మనివేల వెంకట్రావు పాతికెళ్ళ క్రితం ఇంటి నుంచి వెళ్తూ ఓ లారీ ఎక్కాడు. అది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజన్సీ ప్రాంతంలో ఆపడంతో ఎక్కడ ఉన్నాడో.. ఎటోచ్చాడో తెలియక మతిస్థిమితం కోల్పోయి బిక్షాటన చేస్తూ జీవనం సాగించాడు. అయితే కరోనా వైరస్ వెంకట్రావు పాలిట వరంగా మారింది. కరోనా ఆంక్షలతో బయట తిరగినవ్వని సమయంతో ఓ ఫాస్టర్ ఆయన్ని చేరదిసాడు. రెండేళ్లుగా ఫాస్టర్ వద్దనే ఉంటూ వచ్చాడు. ఇదే క్రమంలో ఓ రోజు వెంకట్రావు గతం చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. ఆయన స్వగ్రామం పేరు ఫాస్టర్ తో పూసగూచ్చినట్లు చెప్పాడు. దీంతో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి వెంకట్రావ్ వివరాలు చెప్పాడు ఫాస్టర్.. వారి సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంపచోడవరంలో ఉన్న వెంకట్రావును కుటుంబ సభ్యులు కలిసి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. భర్త, తండ్రి లేడన్న బాధలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు వెంకట్రావు రావడంతో ఆనందపడ్డారు. సంబరాలు చేసుకున్నారు.

Read Also…. KTR: మత రాజకీయాలు చేయం.. సచివాలయంలో మసీద్, మందిర్, చర్చి.. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్ వెల్లడి