Horoscope Today (17th July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా సూచిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి సోమవారం నాడు దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రయత్నలోపం ఉండని పక్షంలో కార్యసిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని కలుపుకుని వెళ్లడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టండి. వాహనాలను స్పీడ్ గా నడపకపోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. కొందరు స్నేహితులలో వినోద యాత్ర చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీమార్గం అనుసరిస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమైన వ్యవహారాలను పరిష్కరించుకోవడంలో నిర్లక్ష్యం, అశ్రద్ధలను పక్కన పెట్టడం మంచిది. కాలయాపన అవుతున్న పనులను పూర్తి చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా, అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కుటుంబ పెద్దల కారణంగా ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులలో ఒకరు చదువులు లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్త వినడం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా టెన్షన్, మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల ద్వారా శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలు న్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత వాహనంలో ప్రయాణం చేయకపోవడం శ్రేయస్కరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం కంటే అందరినీ కలుపుకుని పోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, మీ చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం గురించి సంప్రదిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలుంటాయి. ఇంటాబయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢయ1): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చేసమయం ఇది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంతమంచిది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయుడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో కొన్ని ఇంటి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో అధికారుల నుంచే కాకుండా సహోద్యోగుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల అండదండలుంటాయి. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకుసాగుతాయి. నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం కావడం, ఒకటి రెండు చిరకాల వాంఛలు నెరవేరడం, బంధువుల నుంచి శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి. రోజంగా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధువులు చూడడానికి వస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, గౌరవప్రదంగా సాగిపోతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువులలో పిల్లలు విజయాలు సాధిస్తారు.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.