Horoscope Today: వారికి చేతి నిండా డబ్బే.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఇలా..

| Edited By: శివలీల గోపి తుల్వా

May 15, 2023 | 5:00 AM

Horoscope Today (15 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today: వారికి చేతి నిండా డబ్బే.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఇలా..
Horoscope (15th May)
Follow us on

Horoscope Today (15 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  1. మేషం ( అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగానే సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొద్ది ప్రయత్నాలతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెరుగవుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4,, రోహిణి, మృగశిర 1,2): రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులకు విహారయాత్ర చేస్తారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదు అన్నట్టుగా ఉంటుంది. వాగ్దానాలకు, హామీలకు కొంతకాలం పాటు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు సొంత ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమై, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆశించిన డబ్బు చేతికి సకాలంలో అందే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం మంచిది కాదు. బంధువుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి చికాకు పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృధ్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల సహాయంతో ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి తీపి కబురు అందే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బంది పడతారు.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.ఆరోగ్యం పర్వాలేదు.
  9. వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట): ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. దుబారా కారణంగా డబ్బు చేతిలో నిలిచే అవకాశం లేదు. ఉద్యోగ జీవితం కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. తొందరపాటు నిర్ణయాలతో లేదా అనవసర మాటలతో సమస్యలు కొని తెచ్చుకోవద్దు. వ్యక్తిగత విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకోవడం మంచిది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ విషయాల్లో ఆవేశ కావేషాలు, మొండితనం పనికిరాదు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారంలో శుభవార్త వింటారు.
  12. కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గతంలో అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యం లో పాల్గొంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..