Horoscope Today: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త.. 12రాశులకు శుక్రవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త.. 12రాశులకు శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 13th December 2024
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 13, 2024): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ది ఉంటుంది. వ్యాపారాలు కూడా సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగాల్లో కూడా అధికారుల నుంచి మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా నెరవేరుతుంది. ధనాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యయ స్థానంలోని వక్ర గురువు వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో ఒక రూపంలో వృథా అవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో అనుకోకుండా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అదనపు పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహనాల మీదా, శుభ కార్యాల మీదా దృష్టి కేంద్రీకరిస్తారు. సామాజికంగా మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ సూచనలు కనిపిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. పిల్లలు బాగా వృద్ధిలోకివస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, ఇతరత్రా కూడా ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కొద్ది మార్పులతో వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగవద్దు. తండ్రి నుంచి సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అయితే, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఆస్తి వివాదం దాదాపు పరిష్కారం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. బాధ్యతలు మారడం గానీ, హోదా మార డం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి లాభాలు కలుగుతాయి. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము అనుకోకుండా చేతికి అందుతుంది. బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాటు కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ కపోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది. విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాలకు బాగా దూరంగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. వృక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగ జీవితంలో అధికారుల నుంచి అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గడం ప్రారంభిస్తాయి. శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.