దిన ఫలాలు (డిసెంబర్ 13, 2023): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు, వ్యూహాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యో గాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు ఫలి స్తాయి. వృత్తి జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తోబుట్టువులతో వివా దాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపో తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. ఉద్యోగులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీ మనసులోని కోరికల్లో కొన్ని నెరవేరుతాయి. రోజంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గృహ, వాహనాల కొనుగోలు కోసం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగు లతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. మీ నిర్ణ యాలు, మీ ఆలోచ నలు అందరికీ నచ్చేవిగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలను అధిగమించి లాభాల బాటపడతారు. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీకు తిరుగుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుం టారు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారపరంగా కూడా అనుకూలత పెరుగుతుంది. కొన్ని ప్రయత్నాలలో ప్రముఖుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావ రణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం, డబ్బు విషయాల్లో జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఒత్తిడి ఎక్కువ గానూ, విశ్రాంతి తక్కువగానూ ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు అను కూలంగా ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహా రాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో భాగస్థులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువర్గం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపడి మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సతీమణి నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శ్రమ, తిప్పటా ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆర్థిక సమస్యలు లేదా ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు, రాబడి పెంచుకుంటారు. దైవ కార్యాల్లో లేదా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
తల్లి తండ్రుల నుంచి అన్ని విషయాల్లోనూ ఆశించిన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమస్యలను చాలావరకు స్వయంగా పరిష్కరించుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.