Horoscope Today: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.. సోమవారం రాశిఫలాలు..

|

Oct 11, 2021 | 7:34 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా

Horoscope Today: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.. సోమవారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us on

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 1న ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రోజు మేష రాశి వారు ఇష్టమైన పనులను ప్రారంభించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు. కుటుంబసభ్యుల సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం మంచిది.

వృషభ రాశి: ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ముఖ్య పనులను ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు అవసరం. పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.

మిథున రాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ.. పట్టు వదలకుండా ముందడుగు వేయాలి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులను, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలు పాటించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి.

సింహరాశి: ఈ రాశి వారికి శుభసుచనలు కనిపిస్తున్నాయి. సమయానుకూలంగా ముందడుగు వేస్తే మంచిది. తోటివారి సహకారంతో పనులు ప్రారంభిస్తారు.

కన్యరాశి: ఈ రాశి వారు సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు.

తులరాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో కొనసాగిస్తారు. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయొద్దు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి: ఈ రాశివారు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: ఈ రాశి ఈరోజు ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కుంభరాశి: ఈ రాశి వారు ధైర్యంతో అనుకున్న పనులను పూర్తిచేయగలుగుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీనరాశి: ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధైర్యంతో ముందుకు సాగాలి. పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవాలి.

Also Read:

Tirumala Temple: నేడు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

Goda Devi Garland: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల కోసం తమిళనాడు నుండి తిరుమలకు చేరుకున్న గోదాదేవి మాలలు