Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Dec 09, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 9, 2023): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనుకోకుండా కొన్ని మంచి స్నేహాలు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారి ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 09th December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 9, 2023): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనుకోకుండా కొన్ని మంచి స్నేహాలు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. కొద్దిగా ప్రయత్నిస్తే ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పోటీదార్లు, ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులుండక పోవచ్చు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. కోపతాపాల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశ ముంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకోకుండా కొన్ని మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ సలహాల ద్వారా లబ్ధి పొందుతారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగు తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సాను కూల సమాచారం అందుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాలు లాభసాటిగా వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసు కోండి.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో కుటుం సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువులతో పేచీలు తప్పకపోవచ్చు. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపా దన పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చాలావరకు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల కారణంగా కొద్దిగా ఇరకాట పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త నిర్ణయాలకు, కొత్త వ్యూహా లకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరి స్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి కార్యకలాపాలను పెరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవ హారాలు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.