AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి గురువారం దినఫలాలు

మేషం రాశివారికి రాశ్యధిపతి కుజుడు, గురువు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభం రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు, గురు, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిథునం రాశివారికి రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి గురువారం దినఫలాలు
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 08, 2025 | 6:36 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రాశ్యధిపతి కుజుడు, గురువు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి సమస్యలు పరిష్కారం కావచ్చు. వృత్తి, ఉద్యో గాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు, గురు, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం గట్టి పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకుసాగుతాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. పని ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి పొందుతారు. ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్నపనులన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రస్తుతం గురు, శుక్ర, రవి గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధి కార యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన ఉద్యోగుల పట్ల అధికారులకు సానుకూల అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆదాయపరంగా అనుకోని అదృష్టం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నవమ స్థానంలో రాశ్యధిపతి రవి ఉచ్ఛపట్టడం, బుధుడితో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు బాగా శుభప్రదంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా మంచి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు బాగా అనుకూలంగా ముందుకు సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయట పడ తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల, ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో పనిభారం ఉన్నా ఆశించిన ఫలితముంటుంది. వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు, సప్తమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు ఉన్నందువల్ల ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలి తాలనిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చతుర్థ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, పంచమ స్థానంలో ఉచ్ఛ రవి సంచారం వల్ల ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో సన్ని హిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, చతుర్థంలో బుధ, రవులు, పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశిలో ఉచ్ఛ శుక్రుడు, పంచమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధు మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.