Horoscope Today 6th June 2023
Horoscope Today (6th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి మంగళవారం (జూన్ 6వ తేదీ)నాటి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగు తుంది. స్నేహితురాలికి విలువైన కానుకలు కొనిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అలవి కాని లక్ష్యాలను నిర్దేశిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం వేరే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బావుంది. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి, ఉద్యోగానికి ఇబ్బంది లేదు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి మంచి కానుకలు కొనిస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యంగా అయినా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. స్నేహితురాలితో విహారయాత్ర చేస్తారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..