దిన ఫలాలు (జూలై 6, 2024): మేష రాశి వారికి జీతభత్యాలు లేదా అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. జీతభత్యాలు లేదా అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులు ఇంటికి రావడం జరుగుతుంది. అనుకోకుండా స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుం టారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొందరు మిత్రుల వల్ల లేనిపోని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. అధికారులు బాధ్యతలను పెంచడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధు వుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడి, చికాకులకు అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పెళ్లి ప్రయ త్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. అనారోగ్య సూచనలున్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయి పోతుంది. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. ఆదాయ వృద్ధికి అవకాశముంది కానీ ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో సామరస్యం పాటించాల్సిన అవసరం ఉంది. మిత్రుల వల్ల ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులను విజయాలు వరిస్తాయి. పిల్లలు కొద్ది ప్రయత్నంతో పురోగతి సాధి స్తారు. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. స్నేహితుల సహాయంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రాధాన్యాలు మారిపోతాయి. ఆస్తి వివాదంలో అనుకోకుండా విజయం సాధిస్తారు. కొందరు మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు జరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయం కోసం శక్తికి మించి కష్టపడడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి చాలావ రకు బయటపడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. పెండింగు పనులు త్వరితగ తిన పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరు ద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)
ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ ఎక్కువగానే ఉంటాయి. అనవసర బాధ్యతలు తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదా యపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడ తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఉద్యోగంలో ఇతర ఉద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రతి పనిలోనూ కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆచి తూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యో గంలో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపారాల్లో కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట లభి స్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయం అవు తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.