Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Jan 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 6, 2024): మేష రాశి వారికి వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. వృషభ రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 06th January 2024
Follow us on

దిన ఫలాలు (జనవరి 6, 2024): మేష రాశి వారికి వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. వృషభ రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రులతో సర దాగా గడుపుతారు. సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబా నికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధి స్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు. బంధు మిత్రు లతో విందులో పాల్గొంటారు. ఆదాయ మార్గాలలో మెరుగుదల కనిపిస్తుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అదుతాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొన్ని వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. సహాయం పొందినవారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి అవ సరానికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటి విషయాలతో సతమతమవుతారు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఉద్యోగులకు హోదాలు, బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రయాణాలో డబ్బు వృథా అవుతుంది. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య మైన అవసరాలు తీరుతాయి. అయితే, కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్ది పాటి వ్యయ ప్రయాసలతో పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో బాధ్య తలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉప యోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. తల్లితండ్రుల నుంచి అండదండలు లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశాభావంతో వ్యవహరి స్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ సభ్యులతో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. ఇంటా బయటా ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాల కారణంగా ఆదాయం పెరుగుతుంది. ధనపరంగా ఒడిదుడుకులు బాగా తగ్గిపోతాయి. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆహార, విహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. ముఖ్యమైన పనులు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆరోగ్య భంగమేమీ ఉండక పోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించు కుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గి ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అను కూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.