Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు చేపట్టే పనుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి.. జాగ్రత్తలు అవసరం. ఈరోజు రాశి ఫలాలు.
Horoscope Today: రాశిఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. చేపట్టే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎలాంటి నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయి లాంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళితే..
Horoscope Today: రాశిఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. చేపట్టే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎలాంటి నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయి లాంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది. మరి ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మేలు జరుగుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈరోజు వేరు వేరు రూపాల్లో అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. విలువైన వస్తువుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మహాగణపతికి గరకను సమర్పించుకోవడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి:
రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చిన్నచిన్న సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని అంశాల్లో అనుకూలమైన విషయాలను సాధించుకుంటారు. శివారధణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి ఈరోజు నాయకులతో చిన్న చిన్న సమస్యలు ఉంటుంటాయి. చర్చలతో సమస్యలకు పరిష్కారం ఆలోచించడం మంచిది. ఈ రాశివారికి సుదర్శన స్వామి నామ స్మరణ మేలు చేస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు వీరికి రావాల్సిన బాకీలను పట్టుదలతో వ్యవహరిస్తే కానీ.. తిరిగి పొందే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని అనుకూల వార్తలు వినే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పార్వతి అమ్మవారి దర్శనం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.
కన్య రాశి:
ఈ రాశి వారు కుటుంబ విషయంలో ఆలోచించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య అనుబంధాలను విస్తరింపజేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
తులా రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అవివాహితుల విషయంలో కొన్ని సందర్భాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రీ శుక్త పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ తెలివితేటలు ఉపయోగించుకునే సందర్భాలు ఎదురవుతుంటాయి. భూసంబంధిత లాభాలు కూడా స్వీకరించగలుగుతారు. మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తే ఈ రాశి వారికి మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారు తగినట్టువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల గురించి ఆలోచనలు ప్రారంభిస్తారు. దుర్గ అమ్మవారి ఆరాధణ ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మకర రాశి:
మకర రాశి వారు కుటుంబ పెద్దల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య అనుబంధాలను విస్తరించుకుంటారు. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు విలాసవంతమైన ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీ నర్సింహా స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.
మీన రాశి:
మీన రాశి వారు ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకొని పెద్దల ఆశిస్సులు పొందుతారు. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శివుడిని పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.