దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారు అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ద పెంచుతారు. మిథున రాశి వారికి మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. రావలసిన డబ్బు అవసరానికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో సోదరుల నుంచి శుభ వార్తలు వింటారు. ఇల్లు కొనుగోలు వ్యవహారాలను వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక అవసరాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ద పెంచుతారు. ప్రయాణాల వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటి పరిస్థితులు చాలావరకు సహాయకారిగా ఉంటాయి. ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ బాగా పెంచుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. రావలసిన డబ్బు అవసరానికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రయాణా లను వాయిదా వేయడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాలు దాదాపు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేస్తారు. ఆదాయం పెరుగుదలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
బంధుమిత్రులకు సహాయ సహాకారాలు అందజేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్త వుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో అపార్థాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యో గానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు.
కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగాలు సజావుగా సాగిపో తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. కొత్తవారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కొందరు మిత్ర్రులతో స్వల్ప విభే దాలకు అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. రావలసిన డబ్బును, బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యత లను స్వీకరించాల్సి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ పరిస్థితి చాలావరకు ప్రోత్సాహరంగా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరు ద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు, స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవు తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సామ రస్యం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెంచుతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చేపట్టిన పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పెడ తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గృహ, ఆస్తి సంబంధమైన ఒప్పందాలను వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా సమస్యలుంటాయి. వ్యక్తి గత సమస్యలు కొద్ది ప్రయత్నంతో సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఇల్లు కొనాలన్న ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత బలం పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. కొత్త ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.