మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అధికారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఒకరిద్దరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దగ్గర బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంలో చేరవచ్చు. ఉద్యోగ, వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో ఆచి తూచి మాట్లాడండి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు. హామీలకు, వాగ్దానాలకు దూరంగా ఉండండి.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా సాగిపోతుంది. కొత్త ఆఫర్లకు అవకాశం ఉంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో డబ్బు నష్టపోతారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల ద్వారా మంచి సమాచారం అందుతుంది. రిస్కులు తీసుకోవడం మంచిది కాదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా నిలదొక్కుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తోబుట్టువులతో సమస్యలు ఎదురవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామికి స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. పిల్లలు శుభవార్త తీసుకు వస్తారు. నిరుద్యోగులకు చిన్న ఉద్యోగం లభించవచ్చు. రోడ్డు ప్రమాదాలతో జాగ్రత్త.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల వారు చక్కని లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మీ ప్రాభవం కొద్దిగా తగ్గుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు వల్ల మాటల వల్ల నష్టపోతారు. బంధువుల రాకతో బిజీ అవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ఐటీ రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయపరంగా ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. డబ్బు జాగ్రత్త.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడతారు. మొండి బాకీలతో అవస్థలు తప్పకపోవచ్చు. అన్నదమ్ములతో ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. బాగా పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెంపొందుతాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. వృత్తుల్లో ఉన్నవారు లాభాలు సంపాదించుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. తోబుట్టువులకు సహాయంగా నిలబడతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన వెనక్కి పోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎ టువంటి పరిస్థితులలోనూ ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు చేయవద్దు. కొందరు స్నేహితులు మీ ఔదార్యాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ఎటువంటి మార్పు ఉండదు. బంధువులతో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సన్నిహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. అనుకోకుండా ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఇల్లు కొనాలని ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్య ఒకటి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. పిల్లలకు మంచి దారి చూపిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత అధికమవుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..