Horoscope Today: వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు..

దినఫలాలు (అక్టోబర్ 2, 2023): మేష రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు..
Horoscope Today 02nd October 2023

Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2023 | 5:01 AM

దినఫలాలు (అక్టోబర్ 2, 2023): మేష రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండకపోవచ్చు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉండవు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందు కుంటారు. ఉద్యోగంలో అధికారులకు అండగా నిలబడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, బుధ గ్రహాలు శుభ స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని బాగా లాభ పడతారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. సతీమణితో కలిసి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహచారం ప్రకారం ధన స్థానం, తృతీయ స్థానం పటిష్టంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలకు, ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఇదివరకు చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు మంచి ఫలితాలనివ్వడం జరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం, రాశినాథుడు బుధుడు ఉచ్ఛలోకి రావడం వంటి కార ణాల వల్ల ఈ రాశివారికి వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఎంతో సమయస్ఫూర్తితో, వివేకంతో వ్యవహరించి ఆస్తి సంబంధమైన వివాదాలను కూడా పరిష్క రించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సప్తమంలో గురువు, లాభస్థానంలో రాశ్యధిపతి శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఏ రంగంలోని వారికైనా తప్పకుండా పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సతీమణికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

దశమ, లాభస్థానాలు శుభ గ్రహాలతో నిండినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ స్థానం సుస్థిరం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరు ద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశివారికి ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం విశేషం. ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. లాభాలు, ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శని, బుధుల అనుకూలత వల్ల శుభవార్తలు వినడం, ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజన కంగా, అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశికి శుభ గ్రహమైన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం లాంటివి పెట్టుకోవద్దు. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడం మంచిది కాదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు, బుధ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల ఆదాయం పెరగడం, వృత్తి, ఉద్యో గాల్లో సానుకూల పరిస్థితులుండడం, వ్యాపారాల్లో లాభాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పలుకు బడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండక పోవచ్చు. సతీమణితో షాపింగ్ చేయడం జరుగుతుంది. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.