Horoscope Today: ఆ రాశుల వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (May 1, 2025): మేష రాశి వారికి వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోవడంతో పాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (మే 1, 2025): మేష రాశి వారికి వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా కొనసాగుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధు మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహక రంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందు తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరిగి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలను సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవ హారాల్ని చక్కబెడతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమ యం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది. లాభాలకు లోటుండకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు కూడా వసూలవుతాయి. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హుషారుగా సాగిపోతుంది.