AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education Astrology: ఏప్రిల్ నుంచి విద్యార్థులకు కొత్త దశ.. ఆ రాశులకు చెందిన విద్యార్థులు అద్భుతంగా రాణించే ఛాన్స్

గురువు ఉన్నత విద్యకు, పరిశోధనలకు, ఆవిష్కారాలకు కారకుడు. కాగా, రాహువు టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, అకౌంట్స్ వంటి అంశాలకు కారకుడు. గురు, రాహు గ్రహాలు మేషరాశిలో కలవడం వల్ల ఈ అంశాలు ఎంతగానో అభివృద్ధి చెందటం..

Education Astrology: ఏప్రిల్ నుంచి విద్యార్థులకు కొత్త దశ.. ఆ రాశులకు చెందిన విద్యార్థులు అద్భుతంగా రాణించే ఛాన్స్
Education AstrologyImage Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 21, 2023 | 3:54 PM

Share
Zodiac Signs: ఏప్రిల్ 23వ తేదీన మేషరాశిలో గురు రాహువులు కలవటం జరుగుతుంది. ఈ కలయిక వల్ల టెక్నాలజీ టెక్నికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. గురువు ఉన్నత విద్యకు, పరిశోధనలకు, ఆవిష్కారాలకు కారకుడు. కాగా, రాహువు టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, అకౌంట్స్ వంటి అంశాలకు కారకుడు. ఈ రెండు గ్రహాలు మేషరాశిలో కలవడం వల్ల ఈ అంశాలు ఎంతగానో అభివృద్ధి చెందటం, కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశులకు సంబంధించిన విద్యార్థుల జీవితాలలో విశేషమైన మార్పులు జరగటానికి అవకాశం ఉంది. మేషం, మిధునం, కర్కాటకం, సింహం, ధనస్సు, మకర రాశులకు చెందిన విద్యార్థులు ఈ అంశాలలో అద్భుతంగా రాణించే సూచనలు ఉన్నాయి.
మేష రాశికి సంబంధించినంత వరకు ఈ గురు రాహువుల కలయిక టెక్నాలజీ పరంగా సునాయాసంగా పురోగతి సాధించడానికి సహాయపడుతుంది. టెక్నాలజీ సైన్స్ రంగాలలో ఈ రాశి వారు ఉన్నత విద్యలో విజయాలు సాధించి పరిశోధనలకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను పురస్కరించుకొని విదేశాలకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడటానికి, గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. వీరి విద్యార్థి జీవితం సమూలంగా మార్పు చెంది భవిష్యత్తులో మంచి కెరీర్ కు పునాది వేయటం ఖాయంగా జరుగుతుంది. ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 లోపల చోటుచేసుకునే అవకాశం ఉంది.
టెక్నాలజీతో పాటు సైన్స్ ఇంజనీరింగ్ అకౌంట్స్ వంటి అంశాలను చదువుకుంటున్న మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు ఈ ఏడాది ఇటువంటి అంశాలనే ఎంపిక చేసుకొని చదవటం మంచిది. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర రంగంలో ఈ రాశి వారు అతివేగంగా పురోగతి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అత్యున్నత స్థానానికి వెళ్లడానికి ఈ రెండు గ్రహాల కలయిక మార్గం సుగమం చేస్తాయి.
కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి కూడా సైన్స్ కు సంబంధించిన అంశాలలో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ అంశాల కారణంగా ఈ రాశుల వారు దేశ విదేశాల్లో గుర్తింపుతో పాటు విపరీతంగా ధన సంపాదన చేయడానికి కూడా అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి ఏ అంశంలో అయినా ముందుకు దూసుకుపోయే తత్వం కలిగిన ఈ రాశి వారు ఈ ఏడాది తప్పకుండా టెక్నాలజీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. ఏలినాటి శని కారణంగా ఇంతవరకు వీరి విద్యార్థి జీవితం కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఇక నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోయే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు టెక్నాలజీ, సైన్స్, టెక్నికల్, గణితం వంటి అంశాలను ఎంపిక చేసుకొని చదవటం వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనివల్ల వీరి వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా అనూహ్యంగా మారే అవకాశం ఉంది.
కొత్తగా డిగ్రీలలో చేరబోయే విద్యార్థులు టెక్నాలజీ, ఇంజనీరింగ్, అకౌంట్స్ వంటి అంశాలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. ఇప్పటికే ఈ అంశాలలో డిగ్రీలు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ ఏడాది ఏప్రిల్ 23 తర్వాత నుంచి జీవితం సమూలంగా మారటం జరుగుతుంది. ఈ అంశాలలో వీరు విదేశాలకు వెళ్లడానికి, కొత్త గుర్తింపు తెచ్చుకోవడానికి, ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అంశాలలో వీరు పరిశోధనలు చేయడానికి, కొత్తవి కనిపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రంగాలకు చెందిన స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)