Zodiac Signs: మూడు శుభ గ్రహాల స్థితి, వీక్షణల సానుకూల ప్రభావం.. వారికి మార్చి వరకు అన్నిటా విజయాలే!

| Edited By: Janardhan Veluru

Feb 24, 2024 | 4:46 PM

కొన్ని రాశుల్లో శుభ గ్రహాలు సంచారం చేస్తున్నా, ఆ శుభ కొన్ని రాశులను చూసినా ఆ రాశుల వారి జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా సాగిపోతుంటుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు ప్రస్తుతం వరుసగా మేషం, మకరం, కుంభ రాశుల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో గురువు తనకు అయిదు, తొమ్మిది స్థానాల్లో ఉన్న రాశులను వీక్షించడం జరుగుతుంది. బుధ, శుక్ర గ్రహాలు తామున్న రాశులకు ఎదురుగా ఉన్న, అంటే సప్తమ స్థానంలో ఉన్న రాశులను కూడా వీక్షిస్తాయి.

Zodiac Signs: మూడు శుభ గ్రహాల స్థితి, వీక్షణల సానుకూల ప్రభావం.. వారికి మార్చి వరకు అన్నిటా విజయాలే!
Zodiac Signs
Follow us on

కొన్ని రాశుల్లో శుభ గ్రహాలు సంచారం చేస్తున్నా, ఆ శుభ కొన్ని రాశులను చూసినా ఆ రాశుల వారి జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా సాగిపోతుంటుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు ప్రస్తుతం వరుసగా మేషం, మకరం, కుంభ రాశుల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో గురువు తనకు అయిదు, తొమ్మిది స్థానాల్లో ఉన్న రాశులను వీక్షించడం జరుగుతుంది. బుధ, శుక్ర గ్రహాలు తామున్న రాశులకు ఎదురుగా ఉన్న, అంటే సప్తమ స్థానంలో ఉన్న రాశులను కూడా వీక్షిస్తాయి. దీనివల్ల ఆ రాశులకు తప్పకుండా శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం ఈ మూడు శుభ గ్రహాల స్థితి, వీక్షణల వల్ల మేషం. కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులు మార్చి 15వ తేదీ వరకు అత్యధికంగా ప్రయోజనం పొంద బోతున్నాయి.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న గురు గ్రహం ఈ రాశివారికి తప్పకుండా అనేక శుభ ఫలితాలనివ్వడం జరుగు తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కీలక వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గురువు ధన కారకుడైనందువల్ల ఈ రాశివారికి తప్పకుండా సంపద పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. రావలసిన బకాయిలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు బాగా పెరుగుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశిని శుభ గ్రహమైన శుక్రుడు వీక్షిస్తున్నందువల్ల, ఏ పనైనా తేలికగా, ప్రశాంతంగా, సామరస్యంగా పూర్తవుతుంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఏ విషయంలోనూ ఒత్తిడి ఉండే అవకాశం ఉండదు. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
  3. సింహం: ఈ రాశిని భాగ్య స్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి బుధుడు వీక్షించడం వల్ల మార్చి 15 వరకూ ఈ రాశివారి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సామాజికంగా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
  4. తుల: ఈ రాశిని సప్తమ స్థానం నుంచి గురువు వీక్షిస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో అనుకూలతలు ఏర్పడతాయి.
  5. ధనుస్సు: ఈ రాశిని నవమ దృష్టితో గురుడు వీక్షిస్తున్నందువల్ల, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకు బడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్ట యోగం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపద వృద్ధి చెందుతుంది.
  6. మకరం: ఈ రాశిలో ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడి సంచారం జరుగుతున్నందువల్ల ప్రతి పనీ అనుకూలంగా జరుగుతుంటుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. జీవిత భాగస్వామితో సమస్యలు, విభేదాలేవైనా ఉంటే తేలికగా సమసిపోతాయి. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
  7. కుంభం: ఈ రాశిలో బుధ సంచారం జరుగుతున్నందువల్ల అనేక రకాల ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరు గుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తప్పకుండా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలను చదవండి..