వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా ఏర్పడే ఈ యోగాల్లో ఉత్తమైంది అత్యంత మంగళకరమైనది గజకేసరి యోగం. ఈ యోగం ముఖ్యమైన గ్రహాల కలయికతో ఏర్పడుతుంది. మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ గజకేసరి యోగం అపారమైన జ్ఞానాన్ని, కీర్తిని, శక్తిని, విలాసాలను ఇస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రాజయోగం అని చెప్పొచ్చు. అనేక రాశులకు ఈ యోగం అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది
చంద్రుడు, బృహస్పతి సమీపంలో లేదా జన్మ కుండలిలో కలిసి ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు , అంతర్ దృష్టిని సూచిస్తాడు. దేవ గురువు బృహస్పతి జ్ఞానం, విస్తరణకు ప్రతీక. ఈ రెండు ప్రయోజనకరమైన గ్రహాలు కలిసి వచ్చినప్పుడు జీవితంలో కలలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.
జీవితంలో రాత్రనక, పగలనక ఎంత కష్టపడిన అందుకు తగిన ఫలితం దక్కడం లేదని భాధపడుతుంటారు. అంతేకాదు జాతకం ఇలా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేస్తారు అని కూడా భావిస్తారు. అయితే చేసిన పనులకు తగిన ఫలితం గత జన్మ కర్మలను బట్టి అనుభవిస్తారు. మన జీవితంలో కలిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఈసారి గజకేసరి యోగం మేష రాశి, మకర రాశి, ధనురాశి, సింహ రాశులకు అదృష్టాన్ని తీసుకుని రానుంది. ఏ రాశులు ఏఏ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశికి చెందిన యువతీ యువకుల పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డబ్బులు వసూలు అవుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సొంతం అవుతుంది.
మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు గజకేశరి యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రేమించిన వ్యక్తుల విషయంలో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో సక్సెస్ అందుకుంటారు. పూర్వీకుల ఆస్థి కలిసి వస్తుంది. రైతులకు, వ్యవసాయదారులకు వ్యవసాయంలో లాభాలను అందుకుంటారు.
ధను రాశి: ఈ రాశి చెందిన వ్యక్తులకు కూడా గజకేసరి యోగం అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఉన్నత పదువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. జీవితంలో సెటిల్ అవుతారు.
సింహా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు గజకేసరి యోగం శుభాలను ఇస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లల ద్వారా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. పండగ వాతావరణం ఉంటుంది. ఒక పెను ప్రమాదం నుంచి బయటపడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు