Astrology: రవి సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు..

| Edited By: Narender Vaitla

Jul 25, 2023 | 7:00 AM

ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నరవి కారణంగా కొందరి జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రవి గ్రహంతో కలిసి కర్కాటకంలో సంచరిస్తున్న బుధ గ్రహం ఈ నెల 24 న రవిని వదిలిపెట్టి సింహంలో ప్రవేశిస్తుండడంతో రవి కర్కాటక రాశిలో ఒంటరిగా ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనివల్ల రవి మరింత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలవుతుంది. దీనివల్ల...

Astrology: రవి సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు..
Zodiac Signs
Follow us on

ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నరవి కారణంగా కొందరి జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రవి గ్రహంతో కలిసి కర్కాటకంలో సంచరిస్తున్న బుధ గ్రహం ఈ నెల 24 న రవిని వదిలిపెట్టి సింహంలో ప్రవేశిస్తుండడంతో రవి కర్కాటక రాశిలో ఒంటరిగా ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనివల్ల రవి మరింత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలవుతుంది. దీనివల్ల రాజకీయాలు, సామాజిక రంగం, ప్రభుత్వం, అధికారం, రియల్ ఎస్టేట్, వాణిజ్యం వంటి రంగాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు
చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతి రాశివారి పైనా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

మేషం:

ఈ రాశివారికి పంచమాధిపతి అయిన రవి గ్రహం నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో
వీరి మాట చెల్లుబాటు అవుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ప్రాధాన్యం, ప్రాభవం పెరగబోతున్నాయి. వీరి మాటలకు, చేతలకు విలువ పెరుగుతుంది. వచ్చే నెల 17 వరకు వారి వారి రంగాల్లో వారు ఒక వెలుగు వెలగడం జరుగుతుంది.

వృషభం:

ఈ రాశివారికి నాలుగవ స్థానాధిపతి అయిన రవి మూడవ స్థానంలో సంచరించడం వల్ల వీరి ప్రయత్నాలన్నీ సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వీరి దూకుడును చూసి, ప్రత్యర్థులు వెను కంజ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగాల్లో తమ మాటలు, చేతలతో కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది. ప్రయాణాలు, పర్యటనల వల్ల ఆశించిన దాని కంటే ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లోనూ వీరి ప్రాభవం పెరుగుతుంది.

మిథునం:

ఈ రాశివారికి విక్రమ స్థానాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నందు వల్ల వీరిలో చొరవ, సాహసం బాగా పెరిగే అవకాశం ఉంది. దూసుకుపోయే తత్వంతో వీరు రాజకీయాలు, ప్రభుత్వ రంగాల్లో విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీరి ప్రణాళికలు, వ్యూహాలు అధికారులకు, నాయకులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడడమే
కాకుండా శారీరకంగా, మానసికంగా శక్తిని పుంజుకునే సూచనలు కూడా ఉన్నాయి.

కర్కాటకం:

వాక్ స్థానాధిపతి, ధన స్థానాధిపతి అయిన రవి ఈ రాశిలో ప్రవేశించడం వల్ల, ఈ రాశివారికి ఆదాయం సమృద్ధిగా ఉండడం జరుగుతుంది. వీరి వాగ్ధాటి ఎటువంటివారినైనా ఆకట్టుకుంటుంది. రాజకీయాలు, పాలనా రంగాల్లో వీరి మాటకు, చేతకు తిరుగుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో వీరికి ప్రాభవం పెరుగుతుంది. కుటుంబం నుంచి వీరికి అవసరమైన సహాయ సహకారాలు లభి స్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం కావడంతో పాటు, కార్యసిద్ధి, వ్యవహార జయం కూడా ఉంటుంది.

సింహం:

ఈ రాశికి అధిపతి అయిన రవి గ్రహం తన మిత్ర క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరించడం అనేది రాజకీయపరంగా, సామాజికపరంగా విజయాలు సాధించడానికి అవకాశాలు కల్పిస్తుంది. రహస్య శత్రువులు సైతం పరాజయం పాలయ్యేలా చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పద్ధతులను అవలంబించడానికి, కొత్త ప్రణాళికలను అనుసరించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అధికార యోగాన్ని అనుభవించడానికి వీలుంటుంది. సరికొత్త ఆదాయ మార్గాలు అందివస్తాయి.

కన్య:

లాభ స్థానంలో అంటే 11వ స్థానంలో రవి గ్రహం ఉన్నా, సంచరిస్తున్నా జాతకంలో కోటి దోషాలైనా కొట్టుకుపోతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం ఈ రాశివారికి 11వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నందువల్ల వీరు ఏ రంగానికి చెందినవారైనప్పటికీ పురోగతి చెందడం, తన ప్రత్యేకతను నిరూపించుకోవడం జరుగుతుంది. రాజకీయాలు, ప్రభుత్వం, పాలనా రంగాల్లో వీరికి
ఎదురుండకపోవచ్చు. ఏమాత్రం ఊహించని పురోగతికి, ఎదుగుదలకు అవకాశం ఉంటుంది.

తుల:

ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల వీరి కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో వీరి ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు, ప్రత్యేక స్థానం లభిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ, సామాజిక రంగాల పరంగా వీరికి పురోగతితో పాటు ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ రాశివారికి రాజకీయ సంబంధాలు ఏర్పడడం, రాజకీయ ముఖ్యు లతో పటిష్ఠమైన పరిచయాలు ఏర్పడడం వంటివి తప్పకుండా జరిగే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం:

ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన సూర్యుడు తన మిత్ర క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల, వృత్తి, ఉద్యోగాలలో ఈ రాశివారికి స్థిరత్వం లభించడం, ప్రాముఖ్యత పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగాల్లో వీరి సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరి వల్ల ఆ రంగానికి విశ్వసనీయత పెరు
గుతుంది. వాణిజ్య రంగంలోని వారికి కూడా అదృష్టం కలిసి రావడం తప్పకుండా జరుగుతుంది.

ధనుస్సు:

ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతి అయిన రవి మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల, ఈ రాశివారికి ఎదురు చూడని అదృష్ట యోగం, అధికార యోగం పట్టే అవకాశం ఉంది. తప్పకుండా రాజకీయ ప్రాధాన్యం ఏర్పడుతుంది. సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో పాటు, సామాజిక హోదా, పలుకుబడి పెరగడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విస్తృతంగా ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.

మకరం:

ఈ రాశివారికి సప్తమ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ప్రభుత్వోద్యోగాలలో ఉన్నవారు, ముఖ్యంగా అధికార స్థానాలలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించడం, ప్రత్యేక బాధ్యతలు స్వీకరిం చాల్సి రావడం వంటివి జరుగుతాయి. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడడం, పలుకుబడి పెరగడం, అదరపు ఆదాయ మార్గాలు అంది రావడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. సమాజం లోన పలుకుబడి కలిగిన వ్యక్తులతో లేదా రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి.

కుంభం:

ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల తప్పకుండా శత్రు జయం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో లేదా రియల్ ఎస్టేట్ రంగంలో చేరడానికి అవకాశం కలుగుతుంది. ఇదివరకే రాజకీయాల్లో ఉన్నవారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ముఖ్య మైన కార్యకలాపాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది.

మీనం:

ఈ రాశికి సంబంధించినంత వరకూ రవి గ్రహం కర్కాటక రాశి సంచారం ప్రభుత్వపరంగా ప్రయోజనం కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపు లభించడం, ప్రమోషన్లు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అధికారయోగం పట్టే సూచనలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వృత్తిపరంగా, ఆదాయపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వీరి వ్యూహాలు, ప్రణాళికలు విశ్వసనీయతను, ఆదాయాన్ని తీసుకు వస్తాయి.

మరిన్ని ఆస్ట్రాలజీ కథనాల కోసం క్లిక్ చేయండి..