Daily Horoscope Today (12th April 2023)
Horoscope Today (12 ఏప్రిల్ 2023 ): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి బుధవారం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి వెళ్లే సూచనలు ఉన్నాయి. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేయడం మంచిది కాదు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు విజయాలు లభిస్తాయి.అనారోగ్య సమస్య కొద్దిగా పరిష్కారం అవుతుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ పరంగా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు.ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభ్యం అవుతుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధించవచ్చు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొద్దిపాటి అనారోగ్యం సంభవించే సూచనలు ఉన్నాయి. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. చదువుల్లో పిల్లలు పురోగతికి చెందుతారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో తిప్పట తప్పదు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తారు. బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. ఆచి తూచి మాట్లాడడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. హామీలు ఉండవద్దు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. శరీరానికి విశ్రాంతి అవసరం.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి వ్యాపారాల్లో ఆశించినంతగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు పాటిస్తారు. ఐటీ రంగానికి చెందినవారు ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తారు. వృత్తి నిపుణులు బాగా బిజీ అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. డబ్బు జాగ్రత్త.ఆరోగ్యం చాలావరకు నిలకడగానే ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు గానీ, స్థలం కానీ కొనే ఆలోచన చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. విలాసాల మీద దుబారా అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు గడించే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది.ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాల్సి ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. తోబుట్టువుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగం పరవాలేదు.ఆరోగ్యానికి సంబంధించి అనుసరిస్తున్న క్రమశిక్షణ మంచి ఫలితాలను ఇస్తుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి. కుటుంబంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఐటీ, రాజకీయ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో మీ జాగ్రత్తలు బాగానే పనిచేస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. కుటుంబ సభ్యులకు సామరస్యం మెరుగు పడుతుంది. వృత్తి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. చిన్నపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కొందరు మిత్రులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కి సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండటానికి ఇది సమయం కాదు.అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..