సెప్టెంబర్ 16 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి విషయంలో శుభవార్తలు..
Horoscope Today (16 September 2026): బుధవారం దిన ఫలాల్లో మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందనతో పాటు పెళ్లి సంబంధం ఖరారయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ప్రాధాన్యం లభించడంతో పాటు వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (సెప్టెంబర్ 16, 2026): మేష రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం, సమన్వయం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ వాతావరణం బాగా సానుకూలంగా ఉంటుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులు ఇబ్బంది కలిగిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారులు మీకు, మీ పనితీరుకు బాగా ప్రాధాన్యమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. దాంపత్య జీవితం చాలావరకు సానుకూలంగా, సంతోషంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం, సమన్వయం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా తిప్పట ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా ఆశా జనకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబసమే తంగా ఆలయాల సందర్శన చేసుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరు ద్యోగులకు ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవ కాశం ఉంది. జీవిత భాగస్వామికి ధన యోగం పడుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఆర్థికంగా రోజంతా విజయవంతంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు, కొత్త ఆదాయ మార్గాల గురించి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిం చాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగు తాయి. కుటుంబంతో ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులను తేలికగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలమవుతాయి. ఎక్కువగా దైవకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొందరు మిత్రుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, కొన్ని అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవకార్యాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఇతరులకు ఆర్థికంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండదు. లేనిపోని బాధ్యతలను నెత్తికెత్తుకోవడం జరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు లభిస్తాయి.. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్ట డానికి, వ్యాపారాలు విస్తరించడానికి ఆలోచనలు సాగిస్తారు. ఆర్థికాభివృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫ లితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొం టారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఏ పని చేపట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబసమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.



