Horoscope Today (8th Sep): వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు..

| Edited By: Ravi Kiran

Sep 08, 2023 | 5:01 AM

Horoscope Today (08th Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం (8వ తేదీ సెప్టెంబరు 2023) 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Horoscope Today (8th Sep): వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు..
Horoscope Today 11th September 2023
Follow us on

Horoscope Today (08th Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం (8వ తేదీ సెప్టెంబరు 2023) 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రధాన గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. బంధు మిత్రు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు తిరుగుండదు. వివాహ ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ సభ్యు లతో శుభకార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఆధునిక సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం బాగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి వాగ్దా నాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలను కొద్దిగా విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు కొన్ని అలవికాని లక్ష్యాలను నిర్దేశించే సూచనలున్నాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. తలపెట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయా ణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగంలో సంతృప్తికర పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. కొందరు సన్నిహిత మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగ స్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గృహ, వాహన సంబంధమైన రుణాలకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడమే కాకుండా, ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు పెరిగినప్పటికీ, బాగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిం చడం మంచిది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. వ్యక్తిగత నెట్ వర్క్ విస్తరిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగు లకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. బంధుమి త్రుల రాకపోకలుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహా రాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి స్నేహాలు ఏర్పడతాయి. నిరు ద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కొత్త వ్యూహాలను అనుసరిస్తారు. వృత్తి జీవితంలో వేగం పెరుగు తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు లేదా ప్రాజెక్టులు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. చదువులకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్యం కొద్దిగా ప్రకోపించే అవకాశం ఉంది. వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముంద డుగు వేస్తారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కుటుంబ విష యాల్లో తొందరపాటుతనంతో వ్యవహరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ జోలికి పోవద్దు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సోదర వర్గంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొం టారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు, లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్ లెటర్ అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.