Daily Horoscope (August 04): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఎలా ఉంటుంది? ఆగస్టు 04, 2023న(శుక్రవారం) మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రస్తుతం సమయం బాగుంది. ప్రయత్నాలను కొనసాగించడం వల్ల ఆశించిన ఫలితాలను
పొంద గలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు జరిగి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అధికారుల ఆదరణ కారణంగా పురోగతికి ఆస్కారముంది. నిరు ద్యోగులకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో మీ ఆలోచనలకు, నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా సంపాదన పెరగడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపా రంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాల వల్ల ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో తప్పకుండా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారాన్ని అందుకుంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలలో కొన్ని మాత్రమే నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆశించిన ఫలితం అందకపోవచ్చు. ఉద్యో గంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మీ పని తీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల చదువుల మీద మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ సొంత పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల్లో సోదర వర్గంతో రాజీమార్గాన్ని అనుసరించాల్సి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. శుభ కార్యంలో గానీ, దైవ కార్యంలో గానీ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ప్రాభవం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవడం కంటే సొంత బాధ్యతల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రస్తు తానికి ప్రతిఫలం లేని పనులకు వెళ్లకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ పెద్దలలో ఒకరికి స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అలవికాని లక్ష్యాలు మీద పడే అవకాశం
కూడా ఉంది. వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. నిరు ద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులు అండగా ఉంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం అందకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ముందుకు వెడతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనల వల్ల ఆశిం చిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. కొద్దిగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కుటుంబ వ్యవ హారాలలో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నం ఎటువంటిదైనప్పటికీ కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాలతో పాటు, ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా కలిసి
వస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు న్నాయి. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వృత్తి జీవితంలో మార్పులు చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేసి లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధువు లతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. కొన్ని ప్రతిఫలం లేని పనులను నెత్తిన వేసుకునే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో పోటీ పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ముఖ్యమైన పనులన్నీ సవ్యంగానే పూర్తవుతాయి. అప నమ్మకాలతో, అనుమానాలతో పని చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం చాలా వరకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా రాబడి ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. జీవిత
భాగస్వామికి స్వస్థత చేకూరుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులు కొద్దిగా ఇరకాటంలో పెట్టే అవకాశముంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి