Horoscope Today 30th September 2023
దినఫలాలు (సెప్టెంబర్ 30, 2023): మేష రాశి వారు కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. మిథున రాశి వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులతో, కొందరు బంధు వులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. వృత్తి, వ్యాపారాలను లాభాలబాటలో నడిపిస్తారు. సతీమణి నుంచి అన్ని విధాలుగానూ సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు పనికి రావు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకె క్కడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివా దంలో రాజీమార్గం అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్య తలు పెరిగే సూచనలున్నాయి. అర్ధాంగితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజ నకంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సతీమణికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. వాగ్దానాలకు ఇది సమయం కాదు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేపట్టే సూచనలున్నాయి. ఆదాయ పరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కొందరు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఉత్సా హకర వాతావరణం ఉంటుంది. శుభకార్యాల విషయంలో బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన రుణాలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. సతీమణితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనడం, ఆలయాలు సందర్శించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపా రాలు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంది. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. తండ్రి జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. సతీమణి ఏ రంగంలో ఉన్నప్పటికీ, పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వ్యక్తిగతంగా చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కొందరు బంధువులకు, సన్నిహితు లకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరి స్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయపడతారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో, దైవ కార్యాల్లో గడుపుతారు. ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందర పడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.