Horoscope Today: వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Sep 29, 2023 | 5:01 AM

Daily Horoscope (సెప్టెంబర్ 29, 2023): మేష రాశి వారికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం (సెప్టెంబర్ 29, 2023) నాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 29th September 2023
Follow us on

రాశిఫలాలు (సెప్టెంబర్ 29, 2023): మేష రాశి వారికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం (సెప్టెంబర్ 29, 2023) నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఈ రోజు అనేక విషయాల్లో అప్రయత్న కార్యసిద్ధి, వ్యవహార జయం అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం కూడా చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవా లేదు.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలతో పాటు, ఆఫీసు నుంచి రావలసిన బకాయిలు కూడా చేతికి అందు తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడా నికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు మంద కొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు రొటీన్ గా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కు వగా దృష్టి పెడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు ఈ సమయంలో తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల గురించి మిత్రులతో చర్చిస్తారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. ఉద్యో గంలో అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడ తారు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురు తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా విజయం సాధించడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ విషయాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశినాథుడైన గురువుతో సహా శుభ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు ప్రతి ప్రయత్నమూ, ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ అనుకూల సమ యాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలి తాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. కుటుంబ సమస్యలను సమయస్ఫూత్తితో పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సమాజంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు బాగా అండగా నిలబడతారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, వ్యాపారాల్లోనే కాకుండా కుటుంబ విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పాత విషయాలు తలచుకుని బాధపడడం మంచిది కాదు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపు ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.