దినఫలాలు (సెప్టెంబర్ 28, 2023): మేష రాశి వారికి బాగా సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి, కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు అందు కుంటారు.. మిథున రాశి వారికి రుణ ఒత్తిడి తగ్గి మానసికంగా ఊరట కలుగు తుంది.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాడు (సెప్టెంబర్ 28) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
బాగా సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారపరంగా రాబడి బాగా పెరుగుతుంది. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెడ తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి, కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు అందు కుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కరించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు తమకు అందివచ్చిన ఉద్యోగావకాశా లను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తోంది. రుణ ఒత్తిడి తగ్గి మానసికంగా ఊరట కలుగు తుంది. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొం టారు. పిల్లలకు సంబంధించి మంచి విషయాలు తెలుస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సన్నిహితులు, మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులతో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దల నుంచి కొద్దిగా సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. విందు కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అటు అధికారులను, ఇటు సహోద్యోగులను మీ వ్యవహార శైలితో ఆకట్టుకుం టారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలి తాలని స్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవ కాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఇష్టమైన వారి నుంచి ఆహ్వానాలు అందు తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఎటువంటి పని చేపట్టినా సకాలంలో పూర్తవుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమ స్యలను, వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. కాస్తంత ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికి రాదు. ఓర్పుగా వ్యవహరించడం వల్ల ప్రతి వ్యవహారమూ సానుకూలపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొం టారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా జాప్యం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు సన్నిహితు లతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కీలక నిర్ణయాలు తీసుకుని వ్యాపారాలను లాభాల బాటపట్టిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతనపెరిగి ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. సమాజానికి ఉపయోగపడే పనుల్లో పాల్గొంటారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగు తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిల కడగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాలో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు నిదానంగా పరిష్కారం అవుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పక పోవచ్చు. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించ డంతో పాటు గౌరవ మర్యా దలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.