Horoscope Today 26th September 2023
దినఫలాలు (సెప్టెంబర్ 26, 2023): మేష రాశి వారికి మంగళవారంనాడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి మంచిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాడు (సెప్టెంబర్ 26, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఔదార్యం హద్దులు మీరి ఇతరులకు సహాయం చేస్తారు. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో అధికారులతో అధికా రాలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యాని కేమీ ఇబ్బంది ఉండుదు కానీ, కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. సన్నిహితుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. జీవిత భాగస్వామికి బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సోదరులతో విభేదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగి పోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల అండదండలు ఉంటాయి. సహోద్యోగుల కారణంగా ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సానుకూల ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామికి వ్యక్తిగతంగా పురోగతి ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువులు, దగ్గరి బంధువులు అండగా నిలబడతారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనా నికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపా రాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలున్నా అధిగమిస్తారు. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. సహాయం పొందిన స్నేహితులు అవసర సమయానికి ముఖం చాటేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహాయ, వితరణ కార్య క్రమాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం పరవా లేదు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూ లంగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలు నెత్తికెత్తుకుంటారు. కుటుంబపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవలు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత పురోగతికి, ఆదాయం పెంచుకోవడా నికి కొత్త కార్యక్రమాలు చేపడతారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. జీత భత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సా హకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లల పురోగతి సాధిస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మధ్య మధ్య డబ్బు కలిసి వస్తుంటుంది. ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగు తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. అనుకోకుండా కొందరు చిన్న నాటి స్నేహి తులను కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబ వ్యవహారాలను జాగ్తత్తగా పరిష్కరించుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. వ్యక్తిగత సమస్యల మీద శ్రద్ధపెడతారు. ఇతరులతో మీ కష్టనష్టాలను పంచు కోకపోవడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. రాబడి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆశించిన విధంగా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.