Horoscope Today: వారి ఆదాయానికి ఢోకా ఉండదు..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Sep 13, 2023 | 5:00 AM

Daily Horoscope(13 Sep): మేష రాశికి చెందిన వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృషభ రాశికి చెందిన వ్యాపారులు ఆదాయానికి మంచి లాభాలు అందుకుంటారు. మిథునం రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. 12 రాశుల వారికి మంగళవారం (13వ తేదీ సెప్టెంబర్, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి ఆదాయానికి ఢోకా ఉండదు..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 13th September 2023
Follow us on

Daily Horoscope(13 September): మేష రాశికి చెందిన వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృషభ రాశికి చెందిన వ్యాపారులు ఆదాయానికి మంచి లాభాలు అందుకుంటారు. మిథునం రాశివారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. 12 రాశుల వారికి బుధవారం (13వ తేదీ సెప్టెంబర్, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పక పోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయటా ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు
ఉండవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్త
వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): స్థిరాస్తి వ్యవహారాలు నిదానంగా చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాలలో కార్యకలాపాలు బాగా పెరు గుతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నా ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఎక్కువగా దైవకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో అప్పగించిన ప్రాజెక్టులను, లక్ష్యాలను
సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మరింత మెరు గైన పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో శుభవార్తలు అందు తాయి. ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగావకాశాలు పొందడం జరుగు తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలలో పోటీదార్లు వెనక్కి తగ్గుతారు. వృత్తి, ఉద్యోగాలలో శత్రువులుగా కూడా మిత్రులుగా మారతారు. జీవిత భాగస్వామితో కలిసి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సవ్యంగా, సామరస్యంగా వ్యవహరించడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందు తాయి. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి.
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడకపోవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. సమాజంలో పెద్దల పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలకు చదువులకు సంబం ధించి కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు, ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమా చారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఖర్చులు తగ్గించు కోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల
నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. తల్లితండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం కావడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువులు అపనిం దలు వేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.