
Chandra Neecha
మనస్సుకు కారకుడైన చంద్రుడు ఒక్కో రాశిలో రెండున్నర రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని అనుకూల ఫలితాలకు పునాది వేయడం జరుగుతుంది. ఈ నెల(జనవరి) 14, 15, 16 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో నీచబడడం జరుగుతోంది. చంద్రుడికి ఈ రాశి మిత్ర క్షేత్రం కూడా అయినందువల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, కార్యక్రమాలు సమీప భవిష్యత్తులో ధన యోగాలు కలిగించే అవకాశం కూడా ఉంది. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం కావడంతో పాటు మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
- వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడు నీచబడుతున్నందువల్ల ఆరోగ్య సంబంధమైన ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విడాకుల కేసులు, విడిపోవడానికి సంబంధించిన ప్రయత్నాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోయి, సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు పంచమ స్థానంలో నీచబడడం వల్ల శ్రమ, తిప్పట, అలసట, నీరసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ పరిస్థితి అయిదారు గంటలు మాత్రమే. చంద్రుడికి ఈ రాశి మిత్ర క్షేత్రమైనందువల్ల కొన్ని శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం, చొరవ, తెగింపు వంటివి పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఆదాయం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో జీత భత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభ సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్యానాలు అందుతాయి. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు, విభేదాలున్నా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మనసు లోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా తొలగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.