Lunar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం(Solar Eclipse) ఏప్రిల్ 30న సంభవించగా.. ఇప్పుడు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం(Chandragrahanam) ఏర్పడనుంది . మే 16వ తేదీన బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది . జ్యోతిష్యం దృష్ట్యా , గ్రహణం శుభపరిణామంగా భావించారు. చంద్రగ్రహణం రోజున రాహువు చంద్రుడిని మింగుతాడని పురాణాల కథనం. అయితే, శాస్త్రీయ దృక్కోణంలో, గ్రహణం అనేది ఖగోళ సంఘటన చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. గ్రహణం మూడు రకాలు.. జ్యోతిష్యుడు డాక్టర్ అరవింద్ మిశ్రా ప్రకారం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం . అయితే ఈ నెలలో ఏర్పడుతున్న చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు.
ఈ సారి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు వృశ్చికరాశిలో ఉంటాడు. అదే సమయంలో, గ్రహణ సమయంలో కుంభరాశిలో శని ,కుజుడు ఇద్దరూ కలిసి ఉంటారు. అటువంటి పరిస్థితిలో.. చంద్రగ్రహణం రోజు వాతావరణంలో మార్పులు ఏర్పడవచ్చు. తుఫాను కూడా ఉండవచ్చు. అయితే పౌర్ణమి రోజున రెండు శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. రాబోయే చంద్ర గ్రహణం మూడు రాశుల వారికి చాలా శుభకరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశులు ఏమిటో గ్రహణం తెచ్చే మంచి ఏమిటో చూద్దాం..
ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభప్రదం
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..