Budhaditya Yoga
Image Credit source: Getty Images
జనవరి 5 నుంచి 16 వరకు ధనూ రాశిలో బుధ రవుల కలయిక జరుగుతోంది. బుధ, రవుల కలయికను బుధాదిత్య యోగంగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు గురువుకు సంబంధించిన ధనూ రాశిలో కలవడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో బుధుడు ఆదాయాన్ని వృద్ధి చేసే అవకాశం ఉండగా, రవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఒక 11 రోజుల పాటు ఈ రెండు అంశాల్లో అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశులకు తప్పకుండా ఆదాయ, ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ప్రతి ఆదాయ ప్రయత్నమూ రెట్టింపు ఫలితాలనిస్తుంది. అనారోగ్యానికి అను కోకుండా సరైన చికిత్స లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి సైతం ఉప శమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి సప్తమంలో రాశినాథుడైన బుధుడితో రవి కలవడం వల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. తక్కువ శ్రమతో ఎక్కువగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు అంచనాలను మించిన లాభాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆరోగ్యం బాగా మెరు గుపడే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి వైద్య సహాయం లభించే అవకాశం ఉంది.
- సింహం: రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో బుధుడితో కలిసినందువల్ల మహా భాగ్య యోగం కలుగు తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కొద్దిపాటి వ్యయంతో అనారోగ్యానికి ఆశించిన చికిత్స లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, రవులు కలిసినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా శుభారంభం జరుగుతుంది. అను కోకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎటువంటి అనారోగ్యం నుంచయినా ఉపశమనం లభి స్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచన లున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.