జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రరాశులు మానవ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాక గ్రహాల కదలిక కొందరికి శుభప్రదంగానూ, మరి కొందరికీ అశుభంగా ఉంటుంది. అయితే ఈ ఏప్రిఎల్‌లో కొన్ని గ్రహాలు మేషరాశిలో కలవబోతున్నాయి. వాటి ఫలితంగా మేషరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఇక ఈ యోగం రాశిచక్రంలోని 3 రాశులవారికి ఎంతో అదృష్టకరమైన ఫలితాలను ఇవ్వబోతుంది. అవును, మేషరాశిలో ఈ నెల 22న బుధగురురాహుసూర్య గ్రహాలు కలవబోతున్నాయి. మరి ఈ నాలుగు గ్రహాల కలయిక ఏయే 3 గ్రహాలకు శుభప్రదంగా, అదృష్టకరంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సింహ రాశి: సింహ రాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా శుభప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. ఈ యోగం మీ రాశి నుంచి 9వ పాదంలో ఏర్పడనుంది. ఫలితంగా ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఫలితంగా మీరు చేసే ప్రయణాలు, ప్రయత్నాలు చక్కని ఫలితాలను కలిగిస్తాయి. ఇంకా మీరు ఉద్యోగం నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
మిథున రాశి: మిథునరాశి వారికి చతుర్గ్రాహి యోగం చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరగడంతో పాటు వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు లాటరీ లేదా షేర్ మార్కెట్ ద్వారా భారీగా డబ్బు వస్తుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా మేషరాశిలో ఏర్పడబోతున్న చతుర్గ్రాహి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని కర్మ స్థానంపై చతుర్గ్రహీ యోగం ఏర్పడుతుంది. అందుకే మీ ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. మీరు కొత్త ఆర్డర్‌లను పొందడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)